బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 06, 2020 , 08:47:54

మ‌రోసారి అడ్డంగా బుక్కైన థ‌మన్..!

మ‌రోసారి అడ్డంగా బుక్కైన థ‌మన్..!

షార్ట్ టైంలో స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ పేరొందిన ఎస్.ఎస్‌. థ‌మ‌న్ కొద్ది రోజులుగా కాపీ క్యాట్ అనే విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా వి సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విష‌యంలోను కాపీ ఆరోప‌ణ‌లు థ‌మ‌న్‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. నిజానికి, వి చిత్రం మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా అమిత్ త్రివేది ప‌ని చేశారు. అయితే వేరే కమిట్ మెంట్స్ ఉండటంతో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ‌మ‌న్ ఇచ్చారు

వి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరే సినిమాల నుండి కాపీ కొట్టాడ‌ని సోష‌ల్ మీడియాలో మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు.  'వి' బీజీఎమ్ తమిళ్ 'రాచ్చసన్' (తెలుగు 'రాక్షసుడు') ని పోలి ఉంద‌ని అంటుండ‌గా, క్లైమాక్స్ కి ముందు వచ్చే సీక్వెన్స్ లో తమిళ్ 'అసురన్' బ్యాగ్రౌండ్ స్కోర్ వాడాడ‌ని కామెంట్ చేస్తున్నారు. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' 6వ సీజన్ 10వ ఎపిసోడ్ లోని వైల్డ్ ఫైర్ బీజేఎం కూడా థ‌మ‌న్ కాపీ చేశాడ‌ని చెప్పుకొస్తున్నారు. మ‌రి దీనిపై థ‌మ‌న్ ఏమైన స్పందిస్తాడా అనేది చూడాలి. 

ప్ర‌స్తుతం థ‌మ‌న్.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'వకీల్ సాబ్'.. సాయి ధరమ్ తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్'.. రవితేజ 'క్రాక్'.. కీర్తి సురేష్ 'మిస్ ఇండియా' చిత్రాలకి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు థమన్. బాలయ్య - బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న సినిమా.. నాని 'టక్ జగదేశ్'.. వరుణ్ తేజ్ స్పోర్ట్స్ డ్రామా.. మహేష్ బాబు  సర్కారు వారి పాట చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు.


logo