ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్నారు థమన్. అల వైకుంఠపురములో సినిమా కోసం అద్భుతమైన బాణీలు అందించారు థమన్. ఆయన సంగీతంలో రూపొందిన పాటలకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభించింది. అయితే ఇప్పుడు థమన్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలకు ఎక్కువగా కమొట్ అవుతున్నాడు.
టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి- అఖిల్ కాంబినేషన్లో రూపొందుతున్న ఏజెంట్ సినిమాకి ముందుగా థమన్‌ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. కాని అతనికి ఉన్న బిజీ షెడ్యూల్ వలన ఆ సినిమా చేయనని చెప్పాడట. దీంతో కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజాను చిత్ర బృందం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.
థమన్ నిర్ణయాలు ఈ మధ్య ఆశ్చర్యకరంగా ఉన్నాయని, ఆయన గతంలో పని చేసిన దర్శకులతో ఇప్పుడు పని చేసేందుకు ఆసక్తి చూపడం లేదని టాక్స్ వినిపిస్తున్నాయి. కాగా, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, సురేందర్ సినిమా సంయుక్త సమర్పణలో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘ఏజెంట్’ మూవీ రూపొందుతుండగా, ఇందులో సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తోంది. మునుపెన్నడూ చూడని విభిన్నమైన కథ, యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారట. సినిమాలో అఖిల్‌ని ఓ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించనున్నాడు.