సోమవారం 06 జూలై 2020
Cinema - Jun 05, 2020 , 14:59:13

55 కోట్లకి అమ్ముడైన త‌లైవీ.. షాక్ అవుతున్న సినీ వ‌ర్గాలు

55 కోట్లకి అమ్ముడైన త‌లైవీ.. షాక్ అవుతున్న సినీ వ‌ర్గాలు

క‌రోనా ఎఫెక్ట్‌తో చిన్న చిత్రాలే కాక బ‌డా చిత్రాలు కూడా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంల వైపు అడుగులేస్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లు భాష‌లకి సంబంధించిన చాలా చిత్రాలు ఓటీటీలో విడుద‌ల‌య్యేందుకు సిద్ధం కాగా, పురుచ్చ‌త‌లైవి జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న త‌లైవీ కూడా ఓటీటీ బాట ప‌డుతుంద‌ని ఇటీవ‌ల జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా దీనిపై బాలీవుడ్ బ్యూటీ కంగ‌నా ర‌నౌత్ స్పందించింది. 

కంగ‌నా ప్ర‌ధాన పాత్ర‌లో ఏఎల్ విజ‌య్ తెర‌కెక్కిస్తున్న త‌లైవీ చిత్రం ఇప్ప‌టికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకోగా, లాక్‌డౌన్ త‌ర్వాత మిగ‌తా భాగాన్ని పూర్తి చేయ‌నున్నారు. అయితే ఈ చిత్రం ఓటీటీలో డైరెక్ట్‌గా విడుద‌ల అవుతుంద‌ని వ‌స్తున్న వార్త‌ల‌ని కంగనా ర‌నౌత్ ఖండించారు. భారీ స్థాయిలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న త‌లైవీ చిత్రాన్ని డిజిట‌ల్ ప్లాట్‌ఫాంల‌లో రిలీజ్ చేయ‌డం స‌బ‌బు కాదు. వెండితెర‌పైనే చిత్రాన్ని చూడాల‌ని కంగనా పేర్కొన్నారు .బైలింగ్యువ‌ల్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని హిందీ,తమిళ భాష‌ల‌కి గాను అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్ రూ. 55 కోట్ల‌కి సొంతం చేసుకున్నాయి. కాగా,   డిజిట‌ల్ స్పేస్‌లో విడుద‌లైన మ‌ణిక‌ర్ణిక‌, పంగా, జ‌డ్జిమెంట‌ల్ హై క్యా చిత్రాలు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంల ద్వారానే పెట్టిన ఖ‌ర్చుని తిరిగి పొందాయి అని కంగనా  గుర్తు చేసింది.

తలైవీ చిత్రంలో ఎంజీఆర్‌గా  అర‌వింద్ స్వామి  క‌నిపించ‌నున్నారు. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో విడుద‌ల కానున్న ఈ సినిమాని విష్ణు వ‌ర్ధ‌న్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం కంగ‌నా త‌మిళంతో పాటు భ‌ర్త‌నాట్యం నేర్చుకున్నారు. అంతేకాదు ప‌ది కిలోల బ‌రువు కూడా పెరిగింది. సినిమా కోసం కంగ‌నా పెడుతున్న ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌పై చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తుంది.


logo