శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Mar 20, 2020 , 12:37:42

అడ‌విలో అద్భుత సాహ‌సం.. ప్రోమో విడుద‌ల‌

అడ‌విలో అద్భుత సాహ‌సం.. ప్రోమో విడుద‌ల‌

డిస్క‌వ‌రీ ఛాన‌ల్‌లో ప్ర‌సార‌మయ్యే  మ్యాన్ వ‌ర్సెస్ వైల్డ్ ప్రోగ్రామ్ ఎంత పాపుల‌ర్ అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.  బ్రిటీష్ సాహ‌సికుడు బియ‌ర్ గ్రిల్స్ .. మ్యాన్ వ‌ర్సెస్ వైల్డ్ షో కోసం సెల‌బ్రిటీల‌తో సాహ‌సాలు చేస్తూ ఇంట‌ర్వ్యూలు చేస్తుంటాడు. కొన్నాళ్ళ క్రితం ప్ర‌ధాని మోదీతో క‌లిసి ఉత్త‌రాఖండ్‌లో ఓ షో చేసిన గ్రిల్స్‌..  రీసెంట్‌గా ర‌జనీకాంత్‌తో క‌లిసి బందిపుర వైల్డ్ లైఫ్ పార్క్‌లో ప‌ర్య‌టించారు. 

మార్చి 23 రాత్రి 8గం.ల‌కి డిస్క‌వ‌రీ ఛానెల్‌లో ప్ర‌సారం కానున్న ఈ కార్యక్ర‌మంకి సంబంధించిన కొద్ది రోజులుగా ప్రోమోలు విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా రెండు నిమిషాల న‌ల‌భై సెక‌న్ల వీడియో విడుద‌ల చేశారు. ఇందులో ర‌జ‌నీకాంత్ సినిమా ప్ర‌యాణం గురించి ఇంట‌ర్వ్యూ చేశాడు గ్రిల్స్‌.  అంతేకాదు అడ‌వులో చేసే సాహ‌సానికి సంబంధించిన ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంద‌ని ప్ర‌శ్నించాడు. వీట‌న్నింటికి త‌లైవా త‌న‌దైన శైలిలో బ‌దులిచ్చాడు. తాజాగా విడుద‌లైన ప్రోమోపై మీరు ఓ లుక్కేయండి. logo