బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Oct 08, 2020 , 08:39:45

సోహైల్ అన్నంలో వెంట్రుక‌లు, హెయిర్‌పిన్..

సోహైల్ అన్నంలో వెంట్రుక‌లు, హెయిర్‌పిన్..

కెప్టెన్ బ‌రిలో నిలిచేందుకు బీబీ హోట‌ల్ టాస్క్‌లో గెస్ట్‌లు, స్టాఫ్‌లు విప‌రీతంగా జీవించేస్తున్నారు. స‌ర‌దాగా ఉంటూనే సీరియ‌స్ అవుతున్నారు. త‌నకిచ్చిన సీక్రెట్ టాస్క్ వ‌ల‌న అవినాష్ చేసే తుంట‌రి ప‌నుల‌తో ఈ టాస్క్ రక్తి క‌డుతుంది. 32వ ఎపిసోడ్‌లో అతిధులుగా ఉన్న సోహైల్ మ‌ట‌న్ బిర్యానీ ఆర్డ‌ర్ ఇవ్వ‌గా దానిని హోటల్ సిబ్బంది ఎంతో రుచిగా వండి వ‌డ్డించారు. అయితే అందులో వెంట్రుక రావ‌డంతో సోహైల్ ర‌చ్చ ర‌చ్చ చేశాడు. క్ష‌మాప‌ణ‌లు చెప్పినా కూడా కాంప్ర‌మైజ్ కాలేదు.

కొద్ది సేప‌టి త‌ర్వాత సోహైల్‌కి పెట్టిన ఫుడ్‌లో హెయిర్ పిన్ వ‌చ్చింది. సీక్రెట్ టాస్క్‌లో భాగంగా అవినాష్ ఈ ప‌ని చేయ‌గా, దానిని ఎవ‌రు గుర్తించ‌లేదు. అయితే సోహైల్ తినే స‌మయంలో పిన్ క‌నిపించ‌డంతో ఈ విష‌యాన్ని అంద‌రి దృష్టికి తీసుకెళ్ళాడు. పొర‌పాటున ప‌డి ఉండవ‌చ్చ‌ని లాస్య చెప్ప‌డంతో కాస్త శాంతించాడు. 

అనంతరం రీసెప్ష‌న్‌లో ఫోన్ మాట్లాడుతూ ఉన్న మోనాల్ డైనింగ్ టేబుల్ ద‌గ్గ‌ర అన్నం తింటున్న అఖిల్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. వచ్చి రాగానే అత‌నిని హగ్ చేసుకొని ఎందుకు అంత సీరియ‌స్‌గా ఉన్నావ‌ని అడిగింది. దీనికి అఖిల్ అలా ఏంలేదు, త‌ర్వాత మాట్లాడ‌తా అన‌గానే అక్క‌డ నుండి వెళ్లిపోయింది మోనాల్‌. ఇక అతిధులుగా ఉన్న వారి ద‌గ్గ‌ర నుండి హోటల్ సిబ్బంది టిప్స్ తీసుకునేందుకు నానా క‌ష్టాలు ప‌డ్డారు. 

అమ్మ రాజ‌శేఖ‌ర్‌కు స్విమ్మింగ్ పూల్‌లో 100 సార్లు దూకాలనే టాస్క్ ఇవ్వ‌గా, సీరియ‌స్‌గా ఆడి కూల‌బ‌డ్డాడు. ఇక నోయ‌ల్‌కు బెడ్ స‌ర్ధ‌మ‌ని చెప్ప‌గా, ఆ ప‌నిని స‌క్ర‌మంగా పూర్తి చేసి హారిక నుండి టిప్ పొందాడు. అఖిల్‌కి 150 పుష‌ప్స్  చేయాలని టాస్క్ ఇవ్వ‌గా, అతి క‌ష్టం మీద 75 చేశాడు. అభిజిత్ తో 20 కేజీల బ‌రువుని ఎత్తించి పుష‌ప్స్ చేయ‌మ‌నగా, మనోడు 60తో ఆపేశాడు. ఇక లాస్యని థ‌ర్మాకోల్ బౌల్స్ కౌంట్ చేయ‌మ‌ని హారిక చెప్పగా, కొంత ప్ర‌య‌త్నం చేసి విర‌మించుకుంది. 


logo