శనివారం 30 మే 2020
Cinema - Apr 30, 2020 , 10:43:06

ఆ వార్త విని,నా గుండె ప‌గిలింది: ర‌జ‌నీకాంత్‌

ఆ వార్త విని,నా గుండె ప‌గిలింది: ర‌జ‌నీకాంత్‌

బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు రిషి క‌పూర్ మ‌ర‌ణంతో ఇండ‌స్ట్రీలో విషాద ఛాయ‌లు నెల‌కొన్నాయి. 2018 నుండి క్యాన్స‌ర్‌తో ఫైట్ చేస్తున్న ఆయ‌న ఈ రోజు ముంబైలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయ‌న మృతిని అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న ట్వీట్ ద్వారా క‌న్‌ఫాం చేస్తూ ఆత్మ‌కి శాంతి చేకూరాలని ప్రార్ధించారు.

తాజాగా ర‌జ‌నీకాంత్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా రిషీ క‌పూర్ మ‌ర‌ణంపై స్పందించారు. గుండె ప‌గిలినంత ప‌ని అయింది. నీ ఆత్మ‌కి శాంతి చేకూరాలి నా ప్రియ‌మైన స్నేహితుడా అని ట్వీట్‌లో తెలిపారు ర‌జ‌నీకాంత్‌. 

ఇదే వారంలో మ‌రో ఇండియా సినిమా న‌టుడు మ‌ర‌ణించడం బాధాక‌రం. ఒక అద్భుతమైన నటుడు, తరతరాలుగా భారీ అభిమానులని సంపాదించుకున్న ఆయ‌న ఇలా మ‌ర‌ణించడం బాధాక‌రం. అతని కుటుంబానికి, స్నేహితులకు , ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు నా సంతాపం తెలియ‌జేస్తున్నాను అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 


logo