శనివారం 30 మే 2020
Cinema - May 12, 2020 , 13:11:43

స‌ల్మాన్,జాక్వెలిన్ తెరెబినా ఫుల్ వీడియో సాంగ్

స‌ల్మాన్,జాక్వెలిన్ తెరెబినా ఫుల్ వీడియో సాంగ్

లాక్ డౌన్ వ‌ల‌న ప‌న్వెల్ ఫాం హౌజ్‌కి ప‌రిమిత‌మైన స‌ల్మాన్ ఖాన్, జాక్వెలిన్ స‌రికొత్త వీడియో రూపొందించిన సంగ‌తి తెలిసిందే. తెరె బినా అనే పేరుతో రూపొందిన ఈ సాంగ్‌కి సంబంధించిన టీజ‌ర్‌ని రెండు రోజుల క్రితం రిలీజ్ చేయ‌గా, కొద్ది సేప‌టి క్రితం ఫుల్ వీడియో విడుద‌ల చేశారు. ఈ సాంగ్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. 

తెరె బినా సాంగ్‌ని స్వ‌యంగా స‌ల్మాన్ పాడ‌డంతో పాటు డైరెక్ట్ చేశారు. షబ్బీర్ అహ్మ‌ద్ లిరిక్స్ అందించారు.అజ‌య్ భాటియా స్వ‌రాలు స‌మ‌కూర్చారు. ప‌న్వెల్ ఫాం హౌజ్‌లోనే ఈ సాంగ్‌ని షూట్ చేయ‌గా, ఇందులో సల్మాన్, జాక్వెలిన్ మ‌ధ్య రొమాన్స్ కూడా చూడ‌వ‌చ్చు.  స‌ల్మాన్-జాక్వెలిన్ కిక్, రేస్ 3లో క‌లిసి న‌టించిన విష‌యం తెలిసిందే.



logo