సోమవారం 13 జూలై 2020
Cinema - Jun 04, 2020 , 12:43:03

వేదంకి ప‌దేళ్ళు.. కృత‌జ్ఞ‌త‌లు చెప్పిన అల్లు అర్జున్

వేదంకి ప‌దేళ్ళు.. కృత‌జ్ఞ‌త‌లు చెప్పిన అల్లు అర్జున్

క్రిష్ దర్శకత్వంలో రూపొందిన వేదం చిత్రం జూన్ 4, 2010న‌ విడుదలైన సంగ‌తి తెలిసిందే.  అల్లు అర్జున్, అనుష్క శెట్టి, మంచు మనోజ్, మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం నేటితో ప‌దేళ్ళు పూర్తి చేసుకుంది.ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా చిత్ర బృందానికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు,

వేదం ప‌దేళ్ళు పూర్తి చేసుకుంది. అంద‌మైన ప్ర‌యాణంలో నాతో పాటు క‌లిసి ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు. ద‌ర్శ‌కుడు క్రిష్‌కి హృద‌య‌పూర్వక ధ‌న్య‌వాదాలు. మీ విజ‌న్‌, ప్యాష‌న్ న‌న్ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. మ‌నోజ్‌, అనుష్క‌, మ‌నోజ్ భాజ్‌పాయ్‌, ఇత‌ర చిత్ర బృందం అంద‌రికి ధ‌న్య‌వాదాలు. కీర‌వాణి గారు, జ్ఞాన‌శేఖర్ గారికి స్పెష‌ల్ థ్యాంక్స్‌. నన్ను న‌మ్మి నాతో సినిమా చేసిన అర్కా మీడియాకి మ‌నస్పూర్తిగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను అని బ‌న్నీ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

వేశ్య వృత్తిలో ఎన్ని ఇబ్బందులున్నాయి...వారి జీవితాలు కర్పూరంలా ఎలా ఆరిపోతున్నాయనేది అనుష్క‌ పాత్ర ద్వారా చూపాడు దర్శకుడు. పాప్ స్టార్ కావాల‌నుకునే యువ‌కుడి పాత్ర‌లో మనోజ్ న‌టించ‌గా,  ఓల్డ్ సిటీలో  ముస్లిం వ్య‌క్తిగా  మనోజ్ బాజ్‌పాయ్ కనిపిస్తారు. ముస్లిం అయిన పాపానికి   టెర్రరిస్ట్‌గా ముద్ర వేయడం, దాన్నుంచి బయటపడి సౌదీ వెళ్లాలనుకునే టైమ్‌లో పోలీసులు అతడిని అరెస్టు చేయడం సినిమాలో ఆస‌క్తిగా చూపించారు. ఇక జూబ్లిహిల్స్‌లోని స్లమ్ ఏరియాలో కేబుల్ ఆపరేటర్ రాజా పాత్ర‌లో అల్లు అర్జున్ క‌నిపించారు. ప్రతి ఒక్క‌రి పాత్ర‌లు ప్రేక్ష‌కుల‌కి ఎంత‌గానో క‌ట్టిప‌డేశాయి. 


logo