బుధవారం 27 జనవరి 2021
Cinema - Dec 01, 2020 , 09:03:22

సోనూ సూద్ కోసం వెలుస్తున్న గుళ్ళు.. అర్హుడిని కాదంటున్న రియ‌ల్ హీరో

సోనూ సూద్ కోసం వెలుస్తున్న గుళ్ళు.. అర్హుడిని కాదంటున్న రియ‌ల్ హీరో

ఆప‌ద స‌మ‌యంలో ఆప‌ద్భాంద‌వుడిగా నిలిచి అంద‌రివాడు అనిపించుకున్నాడు సోనూసూద్. ఆయ‌న చేసిన సేవ‌ల‌కు అంతే లేదు. చేతికి ఎముక లేన‌ట్టు అనేక సాయాలు చేసిన సోనూసూద్ ప్ర‌జ‌ల గుండెల్లో దేవుడిగా కొల‌వ‌బ‌డుతున్నాడు. కొంద‌రేమో ఆయ‌న‌కు గుళ్లు క‌ట్టి దేవుడిగా పూజిస్తున్నారు. హార‌తులు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా ఉత్తర ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాల ప్ర‌జ‌లు సోనూసూద్‌పై అమిత‌మైన ప్రేమ‌ని చాటుకుంటున్నారు. 

అయితే త‌న‌కు గుడులు క‌ట్టి పూజ‌లు చేయ‌డంపై సోనూసూద్ స్పందించారు. నేను దానికి అర్హుడిని కానంటూ చెప్పుకొస్తున్నారు. కాని ప్ర‌జ‌లు మాత్రం నువ్వు మా ఆరాధ్య దైవ్యం అంటూ కొంద‌రు బ‌య‌ట గుడులు క‌డుతుంటే మ‌రికొంద‌రు గుండెల్లోనే క‌ట్టేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షూటింగ్ చేస్తున్నాడు. అందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు సోనూ.  అలానే అల్లుడు అదుర్స్ అనే చిత్రంలోను న‌టిస్తున్నాడు.


logo