హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, నటుడు కళ్యాణ్ దేవ్ కొవిడ్-19 నుండి కోలుకున్నారు. గత కొన్ని రోజులక్రితం కరోనా బారినపడిన ఆయన తాజాగా కోలుకున్నట్లు ఇన్స్టాగ్రాం ద్వారా గురువారం తెలిపాడు. నేనిప్పుడు కొవిడ్-19 నెగెటివ్. మీరందరూ ఇంట్లోనే ఉంటారని ఆశిస్తున్నా. సురక్షితంగా ఉండండి. నా పట్ల మీరు చేసిన ప్రార్థనలు, చూపిన ప్రేమకు ధన్యవాదాలని కళ్యాణ్ పేర్కొన్నాడు. ఏప్రిల్ 22న కళ్యాణ్ దేవ్ కొవిడ్ పాజిటివ్ బారిన పడిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ తదుపరి చిత్రం సూపర్ మచ్చి. పులి వాసు దర్శకత్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటుంది. రచిత రామ్, రేఖా చక్రవర్తి ఇతర నటీనటులు ఈ మూవీలో నటించారు.