శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Oct 06, 2020 , 19:53:55

పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్‌..వెడ్డింగ్ వీడియో

పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్‌..వెడ్డింగ్ వీడియో

హిందీలో ప‌లు పాపుల‌ర్ సీరియ‌ల్స్ లో క‌నిపించి దేశ‌వ్యాప్తంగా ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది ఢిల్లీ భామ నీతి టాయ్‌ల‌ర్‌. మేం వ‌య‌సుకు వ‌చ్చాం, పెళ్లి పుస్త‌కం, ల‌వ్ డాట్ క‌మ్ వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కులకు ద‌గ్గ‌రైంది. ఈ భామ పెళ్లి చేసుకుంది. నీతి టాయ్ ల‌ర్ ఆగ‌స్టు 13న ప‌‌రీక్షిత్ బ‌వాను వివాహ‌మాడింది. నీతి-ప‌రీక్షిత్ కుటుంబ‌స‌భ్యులు మొద‌ట అక్టోబ‌ర్ లో వెడ్డింగ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. అయితే క‌రోనా కేసులు మ‌రింత పెరిగే అవ‌కాశముంటాయ‌ని భావించిన పెద్ద‌లు..ఆగ‌స్టు లోనే వెడ్డింగ్ ను పూర్తి చేశారు.

'మేం ముందుగా అక్టోబ‌ర్ లోనే పెళ్లి చేసుకోవాల‌నుకున్నాం. కానీ కోవిడ్ పరిస్తితుల దృష్ట్యా ముందుగానే చేసుకోవాల్సి వ‌చ్చింది. మా సిస్ట‌ర్లు య వెడ్డింగ్ కు రాలేక‌పోయారు. కానీ ప‌రిస్థితులు అదుపులోకి వ‌చ్చిన త‌ర్వాత అంద‌రితో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకుంటామ‌ని' నేష‌న‌ల్ మీడియాతో చెప్పుకొచ్చింది నీతి టాయ్‌ల‌ర్‌. త‌న పెళ్లి విష‌యాన్ని, వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ ను ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా షేర్ చేసుకుంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo