బుధవారం 03 జూన్ 2020
Cinema - May 22, 2020 , 16:29:46

సీఎం కేసీఆర్ ను కలిసిన సినీ రంగ పెద్దలు

సీఎం కేసీఆర్ ను కలిసిన సినీ రంగ పెద్దలు

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కలిశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సినీ రంగ పెద్దలు సీఎంను కలిసి.. సినిమా షూటింగ్స్, థియేటర్ల ప్రారంభం విషయమై చర్చిస్తున్నారు. సీఎంతో సమావేశమైన వారిలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, సురేశ్ బాబు, దిల్ రాజు, రాజమౌళి, సి. కల్యాణ్, ఎన్. శంకర్, కొరటాల శివ ఉన్నారు.

లాక్‌డౌన్ వ‌ల‌న సినీ పరిశ్ర‌మ పూర్తిగా స్తంభించిన సంగ‌తి తెలిసిందే. దీని వ‌ల‌న 14 వేల మంది కార్మికులు నిరాశ్ర‌యిల‌య్యారు. పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ  భవిష్యత్తుపై  చిత్ర ప్రముఖులతో గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ భేటీ అయ్యారు. లాక్‌డౌన్‌ కారణంగా సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషిచేస్తాం అని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు.

ఈ సమావేశంలో అవుట్‌డోర్‌, ఇండోర్‌ షూటింగ్‌లు జరిగే ప్రాంతాల్లో తీసుకునే ముందస్తు జాగ్రత్తలను వివరిస్తూ ఓ మాక్‌ వీడియోని కేసీఆర్ ముందు ప్ర‌జెంట్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అలానే షూటింగ్ ప‌రిస‌ర ప్రాంతాల‌లో భౌతిక దూరం పాటిస్తూ ఎలాంటి జాగ్ర‌త్త‌ల‌తో ముందుకు వెళ‌తార‌నేది ఈ స‌మావేశంలో కేసీఆర్‌కి వివ‌రించ‌నున్నారు. 


logo