‘బిగ్బాస్’ ఫేమ్ సయ్యద్ సొహెల్ రియాన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ అనే టైటిల్ ఖరారు చేశారు. మైక్ మూవీస్ పతాకంపై అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకుడు. రూపా కొడువయుర్ కథానాయిక. ఆదివారం టైటిల్ను చిత్రబృందం విడుదలచేసింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘ప్రయోగాత్మక కథాంశంతో తెరకెక్కుతున్న వినూత్న ప్రేమకథా చిత్రమిది. నవ్విస్తూనే ఉత్కంఠను పంచుతుంది. ఈ సినిమాలో సొహెల్ ప్రెగ్నెంట్గా కనిపించబోతున్నారు. అతడి పాత్రచిత్రణ విభిన్నంగా ఉంటుంది. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు. సుహాసిని మణిరత్నం, రాజారవీంద్ర, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ.