సోమవారం 25 మే 2020
Cinema - Apr 10, 2020 , 15:59:28

కేటీఆర్‌కు రూ.25లక్షల చెక్కు అంద‌జేసిన తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబ‌ర్

కేటీఆర్‌కు రూ.25లక్షల చెక్కు అంద‌జేసిన తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబ‌ర్

హైదరాబాద్‌:  క‌రోనా మ‌హ‌మ్మారిపై తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తున్న కృషికి త‌న వంతు సాయం అందించ‌డానికి తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ముందుకు వ‌చ్చింది. తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 25 ల‌క్ష‌లు విరాళంగా అందించింది. ఈ మేర‌కు చాంబ‌ర్ ప్ర‌తినిధులు శుక్ర‌వారం  మంత్రి కేటీఆర్‌ను క‌లిసి రూ. 25 ల‌క్ష‌ల చెక్కును అంద‌జేశారు. 

ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మ‌న్ పి. రామ్మోహ‌న్ రావు, చాంబ‌ర్ అధ్య‌క్షుడు కె. ముర‌ళీమోహ‌న్ రావు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సునీల్ నారంగ్‌, అభిషేక్ నామా పాల్గొన్నారు. క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తున్న  కృషిని వారు ప్ర‌శంసించారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్ర‌జ‌లంద‌రూ ప్ర‌భుత్వానికీ, పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌నీ, ఎవ‌రి ఇళ్ల‌ల్లో వారు సుర‌క్షితంగా ఉంటూ క‌రోనా వ్యాప్తి చెంద‌కుండా త‌మ వంతు పాత్ర పోషించాల‌ని విజ్ఞప్తి చేశారు. 


logo