బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Apr 10, 2020 , 23:22:08

తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ 25లక్షల విరాళం

తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ 25లక్షల విరాళం

కరోనా వైరస్‌ను నిరోధించేందుకు ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మద్దతుగా           నిలిచింది. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ఇరవై ఐదు లక్షల విరాళాన్ని అందించి దాతృత్వాన్ని చాటుకుంది. శుక్రవారం మంత్రి కేటీఆర్‌కు ఛాంబర్‌ అధ్యక్షుడు మురళీమోహన్‌రావు, ప్రధాన కార్యదర్శి సునీల్‌ నారంగ్‌ చెక్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, నిర్మాత పి.రామ్‌మోహన్‌రావు, అభిషేక్‌నామా, అనుపమ్‌, బాలగోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. ‘కరోనా మహమ్మారి రూపంలో దేశం పెను విపత్తును ఎదుర్కొంటున్నది. ఈ వైరస్‌ కారణంగా ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఎంతో మంది జీవితాలు ప్రమాదంలోకి నెట్టబడ్డాయి. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాలు అవిరాళ కృషిని చేస్తున్నాయి. కరోనాపై జరుగుతున్న ఈ పోరాటంలో ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి’ అని ఛాంబర్‌ ప్రతినిధులు తెలిపారు. 

దిల్‌రాజు చెక్‌ అందజేత

కరోనా బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి పది లక్షల్ని అందివ్వనున్నట్లు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ మేరకు శుక్రవారం మంత్రి కేటీఆర్‌ను కలిసిన  దిల్‌రాజు, శిరీష్‌ ఆయనకు చెక్‌ను అందించారు.  

బ్రహ్మానందం 3 లక్షలు

తెలుగు సినీ కార్మికులకు అండగా చిరంజీవి ఆధ్వర్యంలో  ఏర్పాటైన కరోనా క్రైసిస్‌ ఛారిటీ మనకోసంకు  (సీసీసీ) శుక్రవారం ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం మూడు లక్షల విరాళాన్ని ప్రకటించారు.


logo