సోమవారం 03 ఆగస్టు 2020
Cinema - Jul 03, 2020 , 21:06:36

'క‌మిట్‌మెంట్' నుంచి తేజస్వి ఫస్ట్ లుక్

'క‌మిట్‌మెంట్' నుంచి తేజస్వి ఫస్ట్ లుక్

కొద్ది రోజుల క్రితం 'క‌మిట్‌మెంట్‌' సినిమాలోని న‌లుగురు ప్రధాన పాత్రదారులను ఇంట్రడ్యూస్ చేస్తూ విడుద‌ల చేసిన స్పెష‌ల్ పోస్టర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. న‌లుగురి క‌థ‌గా రూపొందుతోన్న ఈ ఎరోటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో తేజ‌స్వి మ‌దివాడ‌, ర‌మ్య ప‌సుపులేటి, సిమ‌ర్ సింగ్‌, అన్వేషి జైన్ మెయిన్ రోల్స్ పోషిస్తున్నారు. "ల‌వ్‌.. డ్రీమ్‌.. హోప్‌..ఫైట్" అనేది ఈ మూవీ ట్యాగ్‌లైన్‌. 

శుక్రవారం (జూలై 3) తేజ‌స్వి మ‌దివాడ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా, 'క‌మిట్‌మెంట్‌'లో ఆమె ఫ‌స్ట్ లుక్ పోస్టర్ ను విడుద‌ల చేశారు.  ఈ పోస్టర్ లో బికినీ ధ‌రించి బోల్డ్ అవ‌తార్‌లో తేజ‌స్వి ద‌ర్శనమిస్తున్నారు. మునుప‌టి పోస్టర్ త‌ర‌హాలోనే ఈ ఫ‌స్ట్ లుక్ పోస్టర్ సైతం అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. 'హైద‌రాబాద్ న‌వాబ్స్' ఫేమ్ ల‌క్ష్మీకాంత్ చెన్నా ర‌చ‌న‌, ద‌ర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి న‌రేష్ కుమ‌ర‌న్ సంగీతం అందిస్తున్నారు. స‌జీష్ రాజేంద్రన్‌, న‌రేష్ రాణా సినిమాటోగ్రాఫ‌ర్లుగా ప‌నిచేస్తున్నారు.

సాంకేతిక బృందం: 

డైలాగ్స్‌: స‌ంతోష్ హ‌ర్ష‌, కార్తీక్‌-అర్జున్‌, క‌ళ్లి క‌ల్యాణ్‌

లిరిక్స్‌:  పూర్ణాచారి, గాంధీ

మ్యూజిక్‌: న‌రేష్ కుమ‌ర‌న్‌

సినిమాటోగ్రఫీ: స‌జీష్ రాజేంద్రన్‌, న‌రేష్ రాణా

ఎడిటింగ్‌: ప్రవీణ్ పూడి

కొరియోగ్రఫీ: హ‌రి కిర‌ణ్‌

పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌

లైన్ ప్రొడ్యూస‌ర్‌:  సురేష్ పొలాకి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ద్వారకేష్‌

నిర్మాత‌లు: బ‌ల‌దేవ్ సింగ్‌, నీలిమ టి.

ర‌చ‌న‌-ద‌ర్శకత్వం: ల‌క్ష్మీకాంత్ చెన్నా

బ్యాన‌ర్స్‌: ఎఫ్‌3 ప్రొడ‌క్షన్స్‌, ఫుట్‌లూజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్


logo