తేజ సజ్జా, ప్రియాప్రకాష్ వారియర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇష్క్’. ‘నాట్ ఏ లవ్‌స్టోరీ’ ఉపశీర్షిక. యస్.యస్.రాజు దర్శకుడు. ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్‌జైన్, వాకాడ అంజన్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఈ నెల 30న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ‘ఈ సినిమా పోస్టర్స్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ప్రేమ పయనంలో ఓ జంట అనుభూతులకు అందమైన దృశ్యరూపంలా ఉంటుంది. హృదయాన్ని కదిలించే సన్నివేశాలుంటాయి’ అని చిత్ర బృందం చెప్పింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్యామ్ కే నాయుడు, సంగీతం: మహతి స్వరసాగర్, దర్శకుడు: యస్.యస్.రాజు.