థియేటర్స్ తెరిచింది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. గతేడాది ఏడు నెలలకు పైగానే థియేటర్స్ పూర్తిగా మూసేశారు. ఆ సమయంలో ఎంతోమంది థియేటర్ యజమానులు తీవ్రంగా నష్టపోయారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 థియేటర్లు శాశ్వతంగా మూసేసారు. జనవరి నుంచి టైమ్ బాగుంది.. మార్చి నాటికి అంతా సెట్ అయింది.. ఇంక ఏప్రిల్ నుంచి వరసగా సినిమాలు వస్తున్నాయి పండగ చేసుకోవచ్చు అనుకుంటున్న తరుణంలో మరోసారి కొవిడ్ వచ్చేసింది. సెకండ్ వేవ్ ఎవరూ ఊహించని స్థాయిలో ఇండియాపై కన్నెర్ర జేసింది. దాంతో ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న థియేటర్స్ వ్యవస్థపై మరోసారి కోలుకోలేని దెబ్బ పడిపోయింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే ఇప్పట్లో ఇవి ఓపెన్ కావడం కలగానే కనిపిస్తుంది. 10 రోజుల లాక్ డౌన్ తర్వాత కూడా థియేటర్స్ ఓపెన్ చేయకూడదని ప్రభుత్వాలు చెప్తున్నట్లు తెలుస్తుంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 శాతం పూర్తయ్యాకే థియేటర్లు ఓపెన్ చేయడానికి అనుమతి ఇవ్వాలని చూస్తున్నట్లు ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావిస్తున్నారు. పరిస్థితులు కూడా అప్పటి వరకు కాస్త చల్లబడతాయని.. కరోనా కేసులు పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకు థియేటర్స్ మూసి ఉంచడమే నయమని ప్రభుత్వాలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఒకవేళ ఇదే నిజమైతే కనక థియేటర్స్ మరికొన్ని నెలల వరకు కూడా తెరుచుకోవడం కష్టమే అవుతుంది. అలాంటప్పుడు మరోసారి ఎగ్జిబిటర్లకు నరకమే. మరోవైపు చాలా సినిమాలు ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పరిస్థితులు అదుపులోకి వస్తే వాటిని విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. కానీ ఆ పరిస్థితులు ఇప్పట్లో అదుపులోకి రావడం గగనంగానే కనిపిస్తుంది. దాంతో ఏం చేయాలో ఎవరికీ అర్థం కావడం లేదు. పరిస్థితులు అనుకూలించే వరకు వేచి చూడటం తప్ప ఇప్పుడు మరే దారి కూడా కనిపించడం లేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
లాక్ డౌన్ ఎఫెక్ట్ : మళ్లీ ఆగిన సీరియల్ షూటింగ్స్
జాతిరత్నం హీరోయిన్ గ్లామర్ పిక్స్.. వైరల్
రాధేతో నిరాశపరచిన ప్రభుదేవా..డైరెక్షన్‌కు బైబై చెప్పాలంటూ సూచన!
కుర్ర దర్శకుల కలలను చిదిమేస్తున్న కరోనా
విష్ణు ప్రియ గ్లామర్ షో.. యువత ఫిదా
పాత ఫార్ములాని ఫాలో అవుతున్న త్రివిక్రమ్..!
రాధే చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో రచ్చ
అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ లుక్.. ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్..!
నాగార్జునతో పదోసారి జోడీ కడుతున్న అనుష్క
సల్మాన్ ఖాన్ రాధే సినిమాకు పైరసీ దెబ్బ
‘పుష్ప’ రెండు భాగాలు చేయడం వెనక పెద్ద కథే ఉంది..!
తమిళియన్‌ను పెండ్లి చేసుకుంటా: రష్మిక