శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 28, 2021 , 08:18:59

కేర‌ళ బాట ప‌ట్ట‌నున్న‌ పుష్ప టీం

కేర‌ళ బాట ప‌ట్ట‌నున్న‌ పుష్ప టీం

అల్లు అర్జున్, ర‌ష్మిక మంధాన ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుకుమార్ తెర‌కెక్కిస్తున్న చిత్రం పుష్ప‌. గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం గ‌త కొద్ది రోజులుగా తూర్పుగోదావ‌రి జిల్లాలోని  మారేడుమిల్లిలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఫిబ్రవరి తొలి వారానికి అక్కడి షెడ్యూల్‌ ముగుస్తుంది.  ఈ షెడ్యూల్ త‌ర్వాత హైద‌రాబాద్‌లో వేసిన సెట్‌లో ప‌ది రోజుల పాటు ఓ షెడ్యూల్ జ‌ర‌ప‌నున్నారు. అనంత‌రం కేర‌ళ వెళ్లి అక్క‌డ లాంగ్ షెడ్యూల్ చేయాల‌ని మేకర్స్ భావిస్తున్నారు.

కరోనా వ‌ల‌న సినిమా ప్లానింగ్స్ అన్ని పూర్తి అయ్యాయి. లాక్ డౌన్ త‌ర్వాత షూటింగ్ మొద‌లు కాగా, ఈ చిత్ర బృందంలో న‌లుగురికి క‌రోనా రావ‌డంతో కొద్ది రోజుల పాటు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. జ‌న‌వ‌రి నుండి మారేడుమిల్లిలో వేగంగా షూటింగ్ చేస్తున్నారు.  శేషాచలం అడవుల్లో కూలీ నుంచి ఎర్రచందనం స్మగ్లర్‌గా మారిన యువకుడిగా క‌థ ఆధారంగా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతుండ‌గా, ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదం అందించడం ఖాయంగా క‌నిపిస్తుంది. 

VIDEOS

logo