గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Oct 10, 2020 , 14:28:17

ర‌కుల్ బ‌ర్త్‌డే.. 'చెక్' పోస్ట‌ర్ విడుద‌ల‌

ర‌కుల్ బ‌ర్త్‌డే.. 'చెక్' పోస్ట‌ర్ విడుద‌ల‌

అందాల భామ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఈ రోజు 30వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు అభిమానులు, ప్రముఖులు నుండి విషెస్ వెల్లువ‌లా వ‌స్తున్నాయి. ఇక ర‌కుల్ చెక్ అనే చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, చిత్ర బృందం ఆమె ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసింది. ఇందులో చాలా సీరియస్‌గా కనిపిస్తున్న రకుల్.. చేతిలో ఓ ఫైల్ పట్టుకొని ఉంది. ఈ లుక్ ఫ్యాన్స్‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది.

నితిన్ ప్ర‌ధాన పాత్ర‌లో చంద్రశేఖర్ యేలేటి తెర‌కెక్కిస్తున్న చిత్రం చెక్. భ‌వ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ మూవీ రూపొందుతోంది. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర ప్రీ లుక్‌ ప్రేక్షకలోకాన్ని విశేషంగా ఆకట్టుకుంది. చిత్రానికి వి. ఆనంద ప్రసాద్ నిర్మాణ బాధ్యతలు చేపట్టగా.. ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. చదరంగం నేపథ్యంలో సాగే సరికొత్త కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ ఉరిశిక్ష పడిన ఖైదీగా న‌టిస్తార‌ని టాక్. ఈ నెల 12 నుంచి నెలాఖరు వరకు చివరి షెడ్యూల్ పూర్తిచేసి రిలీజ్ డేట్ త్వ‌ర‌లోనే ప్రకటిస్తామని అంటున్నారు చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు.