మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Oct 04, 2020 , 16:28:19

క‌రోనా టైం.. స్కాట్లాండ్‌లో షూటింగ్ పూర్తి చేసిన అక్ష‌య్

క‌రోనా టైం.. స్కాట్లాండ్‌లో షూటింగ్ పూర్తి చేసిన అక్ష‌య్

క‌రోనా మ‌హమ్మారి విజృంభిస్తున్న స‌మ‌యంలోను రిస్క్ చేసి బెల్ బాట‌మ్ షూటింగ్ కోసం స్కాట్లాండ్ వెళ్లారు అక్ష‌య్ కుమార్. రీసెంట్‌గా చిత్ర షూటింగ్ పూర్తి కావ‌డంతో అక్టోబ‌ర్ 2న ఇండియాకి వ‌చ్చారు. అయితే కోవిడ్ నిబంధ‌న‌లు స‌డ‌లించిన త‌ర్వాత విదేశాల‌కు వెళ్లి స‌క్సెస్ ఫుల్‌గా షూటింగ్ పూర్తి చేసిన తొలి హీరో అక్ష‌య్ కాగా,  త‌న మూవీకి సంబంధించిన 120మంది స‌భ్యుల‌తో కలిసి ఫ్లైట్‌లోనే ఫోటోకు ఫోజులిచ్చారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుంది. 

బెల్ బాట‌మ్ చిత్ర యూనిట్ స్పెష‌ల్ చార్టెడ్ ఫ్లైట్ లో స్కాట్లాండ్ కు వెళ్లగా, అక్క‌డ‌ 14 రోజులు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. క్వారంటైన్ టైం పూర్త‌యిన త‌ర్వాత అంద‌రికి పరీక్ష‌లు జ‌ర‌ప‌గా అందులో నెగిటివ్ రిపోర్ట్ తేల‌డంతో తిరిగి షూటింగ్ ప్రారంభించారు. మూవీకి సంబంధించిన టీజ‌ర్ మ‌రి కొద్ది గంట‌ల‌లో రిలీజ్ కానుంది. చిత్రాన్ని థియేట‌ర్స్ తెరిచాక విడుద‌ల చేస్తారా, లేదంటే ఓటీటీలో విడుద‌ల చేస్తారా అన్న‌ది తెలియాల్సి ఉంది. కాగా, అక్ష‌య్ ల‌క్ష్మీ బాంబ్ చిత్రం ఓటీటీలో విడుదల కానున్న విష‌యం తెలిసిందే. logo