ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 05, 2020 , 12:13:23

టీచర్స్ డే : దర్శకులకి ధన్యవాదాలు తెలిపిన మెగా హీరో

టీచర్స్ డే : దర్శకులకి ధన్యవాదాలు తెలిపిన మెగా హీరో

ముకుంద సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్ సక్సెస్ ఫుల్‌ హీరో అనిపించుకుంటున్నాడు. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్నాడు. అయితే ఈ రోజు గురు పూజోత్సవం సందర్భంగా తనతో పని చేసిన దర్శకులందరికి ధన్యవాదాలు తెలిపారు.

నటుడిగా నా ప్రయాణంలో  దర్శకులు ఎప్పుడూ అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తులు.  మీరు నాపై చూపిన ప్రభావం కేవలం ఒక సినిమాతో   మరచిపోయే విషయం కాదు. ప్రతి ఒక్కరి నుంచి చాలా  నేర్చుకున్నాను.  అందరికి ధన్యవాదాలు అంటూ వరుణ్‌ ట్వీట్‌ చేశారు.


logo