ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 13, 2020 , 19:06:47

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు క‌రోనా పాజిటివ్‌

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు క‌రోనా పాజిటివ్‌

అమ‌రావ‌తి: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజార‌పు అచ్చెన్నాయుడుకు క‌రోనా సోకింది. అచ్చెనాయుడు ప‌రీక్ష‌లు చేయించుకోగా క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయింద‌ని ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాది తెలిపారు. ఈఎస్ఐ స్కాం కేసులో అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే అనారోగ్యం కార‌ణంగా కొంత‌కాలంగా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప్ర‌స్తుతం గుంటూరులోని ర‌మేశ్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడు ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని న్యాయ‌వాది తెలియజేశారు. 

2 నెల‌ల క్రితం ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయిన త‌ర్వాత అచ్చెన్నాయుడు బెయిల్ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. అయితే ఏసీబీ కోర్టుతోపాటు హైకోర్టు కూడా ఆయ‌న బెయిల్ ను తిర‌స్క‌రించాయి. అనారోగ్యం దృష్ట్యా అచ్చెన్నాయుడికి కోరుకున్న ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo