మంగళవారం 26 మే 2020
Cinema - Apr 28, 2020 , 18:16:17

సీఎం రిలీఫ్ ఫండ్ కు టీజీ విశ్వ‌ప్ర‌సాద్ రూ.25 ల‌క్ష‌ల విరాళం

సీఎం రిలీఫ్ ఫండ్ కు టీజీ విశ్వ‌ప్ర‌సాద్ రూ.25 ల‌క్ష‌ల విరాళం

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కరోనాపై చేస్తున్న పోరాటానికి ప్ర‌ముఖులు మ‌ద్దుతుగా నిలుస్తున్నారు. ప్రముఖ  నిర్మాత, వ్యాపారవేత్త, పీపుల్ టెక్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్ర నిర్మాణ సంస్థ అధినేత టి.జి. విశ్వప్రసాద్  తెలంగాణ‌ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. టి.జి. విశ్వప్రసాద్  తమ సంస్థలైన 'పీపుల్ టెక్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఉద్యోగుల ఒకరోజు  వేతనానికి సమానంగా మరికొంత మొత్తాన్ని జతచేసి, మొత్తంగా  రూ.25 లక్షల చెక్కును ఇవాళ ఉదయం సంస్థ సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల తో కలిసి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అంద‌జేశారు. 

టి.జి. విశ్వప్రసాద్ ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడల్లా తన వంతు బాధ్యతగా స్పందిస్తూ ఉంటారు. ఇది తమ సంస్థల సామాజిక సేవా కార్యక్రమాలలో భాగం టిజి విశ్వ‌ప్ర‌సాద్ అంటున్నారు. ఈ సంద‌ర్భంగా టీజీ విశ్వ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ..ప్రస్తుతం యావత్ ప్రపంచం కరోనా మహమ్మారి వల్ల భయాందోళనలో ఉంది. క‌రోనా వైర‌స్ ‌(కోవిడ్ 19) నిర్మూల‌న‌కు కేంద్ర‌, వివిధ రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధ ప్ర‌తిపాదిక‌న చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కనేందుకు ప్రభుత్వాలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయన్నారు. 

క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) కార‌ణంగా అంతర్జాతీయ విప‌త్తు ఏర్ప‌డిందని టీజీ విశ్వ‌ప్రసాద్ అన్నారు. దీని నివారించ‌డం మ‌న బాధ్య‌త‌. అందుకు తీసుకుంటున్న నివార‌ణా చ‌ర్య‌ల‌కు మ‌న వంతు స‌హ‌కారాన్ని అందించాలి. అందులో భాగంగా. క‌రోనా వైర‌స్ నివార‌ణ కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను అభినందిస్తున్నాం. కరోనా నివారణ చర్యలలో భాగంగా లాక్ డౌన్ లో పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు  చేస్తున్న సేవలను ఈ  సందర్భంగా  కొనియాడారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండండి, క్షేమంగా ఉండండని ఆకాంక్షించారు.


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo