IT Raids on Sonu Sood | రియల్ హీరో సోనూ సోద్ నివాసంపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిపింది. ముంబైలోని ఆయన నివాసంతో పాటు ఆఫీసులో ఐటీ శాఖ ఈ సోదాలు నిర్వహించింది. మొత్తం ఆరు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. సోనూసూద్‌కు సంబంధించిన ఆదాయ వివరాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో సోనూసూద్ నివాసంలో ఐటీ శాఖ ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన స్కూల్ విద్యార్థుల మెంటార్షిప్ ప్రోగ్రామ్‌కు సోనూసూద్ ఇటీవల బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సోనూసూద్ సమావేశమైన కొద్ది రోజుల్లోనే ఆయన నివాసాల్లో ఐటీ సోదాలు జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Amitabh Bachchan : డెలివరీ బాయ్ అవతారమెత్తిన అమితాబ్ బచ్చన్.. ఎందుకంటే..?
రాజేంద్ర ప్రసాద్ కొడుకు హీరో ఎందుకు కాలేకపోయాడు..?
ఒంటరిగా పూజాహెగ్డే పార్టీ..ఇన్ స్టా పోస్ట్‌పై లుక్కేయాల్సిందే