బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 03, 2020 , 15:51:17

టాటా ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్, మ్యూజిక్ వీడియోస్ కాంటెస్ట్

టాటా ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్, మ్యూజిక్ వీడియోస్ కాంటెస్ట్

ప్రముఖ యన్ఆర్ఐ సంస్థ తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TATA) ప్రతిష్టాత్మకమైన షార్ట్ ఫిల్మ్, మ్యూజిక్ వీడియోస్ కాంటెస్ట్ ను చిత్రం భళారే విచిత్రం పేరుతో నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్ న్యాయ నిర్ణేతలుగా జాతీయ స్థాయి ఉత్తమ చిత్రం "మహానటి" దర్శకులు నాగ్ అశ్విన్, సామాజిక అంశాలతో అవార్డ్ పొందిన లఘు చిత్రాలు ,మ్యూజిక్ వీడియోస్ రూపొందించిన  ప్రముఖ లఘు చిత్రాల దర్శకులు డా.ఆనంద్ వ్యవహరించడం విశేషం.

ఈ సందర్భంగా తెలంగాణ అమెరికా తెలుగు సంఘం నిర్వాహకులు అశోక్ చింతకుంట, రమ కె వనమ, ఉష మన్నెం,దీప్తి రెడ్డి, నిత్యశ్రీ మీడియాతో మాట్లాడుతూ..సామాజిక ఇతివృత్తంగా పదిహేను నిమిషాల నిడివి గల లఘు చిత్రాలను ,4 నిమిషాల నిడివి గల మ్యూజిక్ వీడియోలను  జులై నెల 15 వ తేదీలోగా పంపించ వచ్చని, ఈ అవకాశాన్ని ప్రతిభ, ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవలసిందిగా తెలియజేశారు.logo