సోమవారం 03 ఆగస్టు 2020
Cinema - Jul 01, 2020 , 13:45:05

ట్రోలింగ్ చేసే వారిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన తరుణ్ భాస్క‌ర్

ట్రోలింగ్ చేసే వారిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన తరుణ్ భాస్క‌ర్

సినిమా సెల‌బ్రిటీలు అప్పుడప్పుడు ప‌లు విష‌యాల‌పై  త‌మ అభిప్రాయాల‌ని సోష‌ల్ మీడియాలో వ్య‌క్త‌ప‌రుస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా పెళ్లి చూపులు డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ మ‌ల‌యాళ సినిమా క‌ప్పెల‌పై త‌న ఒపీనియ‌న్ రాసాడు. ఇందులో హీరో అర‌వ‌డాలు లేవు, మాస్ అప్పీల్ లేదు. అన‌వ‌స‌ర‌పు స‌న్నివేశాలు లేవు అంటూ పెద్ద పోస్ట్ పెట్టారు.

అయితే కొంద‌రు అభిమానులు త‌రుణ్ భాస్క‌ర్‌.. మా హీరో గురించే ఆ పోస్ట్ పెట్టాడ‌ని భావించి సోషల్ మీడియా వేదికగా తరుణ్ పై ట్వీట్స్ దాడి చేసారు. కొంద‌రు దుర్భాషలాడడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని తరుణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు త‌న‌ని వేధించిన వారి ఫోన్ నెంబ‌ర్స్‌, ఐడీలు సైబ‌ర్ పోలీసుల‌కి అందించారు. గచ్చిబౌలి పోలీసులు త‌న ఫిర్యాదుని స్వీక‌రించిన‌ట్టు త‌రుణ్ భాస్కర్ పేర్కొన్నారు. పెళ్లి చూపులు త‌ర్వాత త‌రుణ్ భాస్కర్  ఈ నగరానికి ఏమైంది అనే ప్రయోగాత్మక చిత్రం చేశారు. ఇక గత ఏడాది  మీకు మాత్రమే చెప్తా అనే చిత్రంతో హీరోగా కనిపించాడు.logo