గురువారం 03 డిసెంబర్ 2020
Cinema - Nov 22, 2020 , 00:17:16

తాప్సీ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌

తాప్సీ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో జీవిత కథా చిత్రాల రూపకల్పన ఎక్కువగా జరుగుతోంది. వివిధరంగాల్లోని ప్రముఖుల విజయగాథలు వెండితెరపై దృశ్యమానమవుతున్నాయి. ఈ కోవలోనే అగ్ర కథానాయిక తాప్సీ..భారత మహిళా క్రికెట్‌ మాజీ కెప్టెన్‌, హైదరాబాద్‌ అమ్మాయి మిథాలీరాజ్‌ బయోపిక్‌లో నటిస్తోంది. ‘శభాష్‌ మిత్తు’ పేరుతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రాహుల్‌ దొలాకియా దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాదిలో షూటింగ్‌ ప్రారంభంకానుంది. ఈ చిత్రం కోసం తాప్సీ మూడునెలల పాటు క్రికెట్‌ బ్యాటింగ్‌లో శిక్షణ తీసుకోబోతున్నట్లు తెలిపింది. ‘పాత్రలో పర్‌ఫెక్షన్‌ రావాలన్నదే నా తపన. అందుకే మూడు నెలల పాటు క్రికెట్‌లో కఠోర శిక్షణ తీసుకోబోతున్నా. వచ్చే ఏడాది క్రికెట్‌ శ్వాసగా జీవించాలనుకుంటున్నా’ అని తాప్సీ చెప్పింది. ఇదిలావుండగా ప్రస్తుతం తాప్సీ మహిళా అథ్లెట్‌ కథాంశంతో రూపొందిస్తున్న ‘రష్మీ రాకెట్‌' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా కోసం రన్నింగ్‌లో ప్రాక్టీస్‌ చేయడంతో పాటు ధృడమైన శారీరకసౌష్టవం కోసం కసరత్తులు చేసింది.