బుధవారం 20 జనవరి 2021
Cinema - Dec 04, 2020 , 12:11:58

ఫ‌స్ట్ క్ర‌ష్ గురించి ఓపెన్ అయిన తాప్సీ

ఫ‌స్ట్ క్ర‌ష్ గురించి ఓపెన్ అయిన తాప్సీ

చూడ‌చ‌క్క‌టి అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం తాప్సీ సొంతం. హిందీలో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషిస్తూ అల‌రిస్తూ వ‌స్తున్న తాప్సీ ప్ర‌స్తుతం ర‌ష్మీ రాకెట్ అనే సినిమా చేస్తుంది. ఇందులో అథ్లెట్‌గా క‌నిపించ‌నున్న ఈ అమ్మడు పాత్ర కోసం త‌న బాడీని పూర్తిగా మార్చుకుంటుంది. ఇందుకు సంబంధించి ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ వ‌స్తుంది. అయితే ఈ ఫొటోల‌పై స్పందించిన  ఓ నెటిజ‌న్.. నువ్వో ఫాల్తూ హీరోయిన్ వు అయినా నువ్వు సినిమాలు చేస్తుంటావు" అని కామెంట్ చేశాడు . ఈ కామెంట్‌కు తాప్సీ  .. నేను నా సినిమాల ద్వారా ఇక్కడి స్టాండర్డ్స్‌ను పెంచాను. నీకు మాత్రం ఈ విషయం అర్థం కావడం లేదు అని పేర్కొంది.

ఇక తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న ఫ‌స్ట్ క్ర‌ష్ గురించి చెప్పుకొచ్చింది. తొమ్మిదో త‌ర‌గ‌తిలో ఓ అబ్బాయిని ప్రేమించాను. అత‌డు నన్ను ఇష్ట‌ప‌డ్డాడు. ఇద్ద‌రం కొన్నాళ్లు బాగానే ఉన్నాం. కాని ఏమైందో ఏమో త‌ర్వాత నేను చ‌దుకోవాలి అంటూ దూర‌మ‌య్యాడు. ఓ రోజు టెలిఫోన్ బూత్‌కి వెళ్లి కాల్ చేయ‌గా, అత‌ను స్పందించ‌లేదు.చాలా ఏడ్చాను. టీనేజ్ ల‌వ్ గురించి త‌ల‌చుకుంటే న‌వ్వొస్తుంద‌ని చెప్పుకొచ్చింది తాప్సీ.


logo