మంగళవారం 02 జూన్ 2020
Cinema - May 19, 2020 , 12:07:12

రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకున్న తాప్సీ..!

రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకున్న తాప్సీ..!

క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా గ‌త రెండు నెల‌లుగా దేశ‌మంతా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ వ‌ల‌న అన్ని ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ్డాయి. చాలా మంది దిక్కుతోచ‌ని ప‌రిస్థితుల‌లో ఉన్నారు. సినీ ప‌రిశ్ర‌మ విష‌యానికి వ‌స్తే రోజువారి వేత‌నం పొందే సినీ కార్మికుల‌తో పాటు నిర్మాతలు కూడా ఇబ్బందుల్లో ప‌డ్డారు. భారీ ఖ‌ర్చుతో సినిమాలు నిర్మించిన వారు థియేట‌ర్స్ లేని కార‌ణంగా  సినిమాల‌ని రిలీజ్ చేయ‌లేక నానా తంటాలు ప‌డుతున్నారు.‌

నిర్మాతలు బావుంటేనే సినిమా ఇండస్ట్రీ బావుంటుంది. ఇలాంటి స‌మ‌యంలో వారికి అండ‌గా నిల‌వాల్సిన ప‌రిస్థితి త‌మ‌కి ఉంద‌ని భావించిన కొంద‌రు ద‌ర్శ‌కులు, న‌టీన‌టులు రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకుంటున్నారు. ఇప్ప‌టికే త‌న రెమ్యున‌రేష‌న్‌ని  25 శాతం తగ్గించుకోనున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించాడు త‌మిళ ద‌ర్శ‌కుడు హ‌రి. అలాగే తమిళ హీరో హరీష్‌ కల్యాణ్‌ (‘జెర్సీ’లో నాని కుమారుడిగా నటించారు) , తమిళ నటుడు విజయ్‌ ఆంటోనీ కూడా తన రెమ్యూనరేషన్‌లో 25 శాతం తగ్గించుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. తాజాగా తాప్సీ పన్ను కూడా రెమ్యున‌రేష‌న్‌ని త‌గ్గించింద‌ట‌. నిర్మాతల క్షేమం కోరి తాను ఈ  నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తుంది.


logo