మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Sep 30, 2020 , 00:35:18

నూతన తారాగణంతో

నూతన తారాగణంతో

నూతన నటీనటులతో టాంగా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. పృథ్వీసేన రెడ్డి దర్శకుడు.  విజయ్‌ దశి, ప్రదీప్‌ ఎర్రబెల్లి నిర్మాతలు. ఈ కార్యక్రమానికి దర్శకనిర్మాత మధుర శ్రీధర్‌రెడ్డి, కృష్ణచైతన్య హాజరయ్యారు. నిర్మాత విజయ్‌ దశి చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా మా సంస్థ నిర్మిస్తున్న తొలి చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. రెండో చిత్రాన్ని ప్రేమకథా ఇతివృత్తంతో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తాం.  దాదాపు 500 మందిని ఆడిషన్స్‌ చేసి నటీనటుల్ని ఎంపిక చేశాం. వారి వివరాల్ని త్వరలో తెలియజేస్తాం. అక్టోబర్‌ మొదటివారంలో షూటింగ్‌ మొదలుపెట్టి వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారుlogo