శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 20, 2021 , 10:29:24

హిందూ మ‌తాన్ని కించ ప‌రిచారు.. శిక్ష త‌ప్ప‌దు!

హిందూ మ‌తాన్ని కించ ప‌రిచారు.. శిక్ష త‌ప్ప‌దు!

ల‌క్నో: అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న తాండ‌వ్ వెబ్ సిరీస్ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు, న‌టుల‌పై క‌చ్చితంగా చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తేల్చి చెప్పింది. వాళ్లు హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ తీశార‌ని, క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని యూపీ డిప్యూటీ సీఎం కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య స్ప‌ష్టం చేశారు. తాండ‌వ్ వెబ్ సిరీస్‌ ప్రొడ్యూస‌ర్‌, డైరెక్ట‌ర్‌, న‌టులు నేరం చేశారు. హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీశారు. వాళ్ల‌పై క‌ఠిన‌మైన చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాం అని కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య ట్వీట్ చేశారు. 

ఇప్ప‌టికే తాండ‌వ్‌పై ఇటు యూపీలో, అటు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప‌లు కేసులు న‌మోద‌య్యాయి. హ‌జ్ర‌త్‌గంజ్‌కు చెందిన నలుగురు పోలీసు అధికారులు.. కేసు విచార‌ణ కోసం ముంబై వెళ్లారు. ఇప్ప‌టికే తాండ‌వ్ మేక‌ర్స్‌.. క్ష‌మాప‌ణ చెప్పిన విష‌యం తెలిసిందే. ఉద్దేశ‌పూర్వ‌కంగా తాము ఈ ప‌ని చేయ‌లేద‌ని, ఎవ‌రి మ‌నోభావాలైనా దెబ్బ తింటే క్ష‌మించాల‌ని వాళ్లు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

VIDEOS

logo