‘తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తరలిరావడానికి ఎనలేని కృషిచేసిన వారిలో ప్రభాకర్‌రెడ్డి ఒకరు. సినీ కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం తపించేవారాయన’ అని అన్నారు దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. చిత్రపురి హౌసింగ్ సొసైటీలో దివంగత నటుడు ఎం. ప్రభాకర్‌రెడ్డి విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో సి.కల్యాణ్ మాట్లాడుతూ ‘సినీ కార్మికుల జీవితాలు బాగుండాలని ప్రభాకర్రెడ్డిగారితో పాటు దాసరి నారాయణరావు ఎంతో శ్రమించారు. ప్రభాకర్‌రెడ్డితో పాటు దాసరి విగ్రహాన్ని నెలకొల్పితే బాగుంటుంది’ అన్నారు. ప్రభాకర్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుత కమిటీ పనిచేస్తోందని హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు ఎన్.శంకర్, ప్రభాకర్‌రెడ్డి భార్య లక్ష్మీతో పాటు కూతుళ్లు పాల్గొన్నారు.