శనివారం 06 మార్చి 2021
Cinema - Jan 19, 2021 , 20:40:00

శింబును వెలేసిన నిర్మాతల మండలి..మళ్లీ ఏం చేసాడు..?

శింబును వెలేసిన నిర్మాతల మండలి..మళ్లీ ఏం చేసాడు..?

తమిళ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ తో పాటు కాంట్రవర్సీ కింగ్ అనే పేరు తెచ్చుకున్న హీరో శింబు. ఈయనకు అభిమానులతో పాటు వివాదాలు కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఈయన మరో వివాదంలో ఇరుక్కున్నాడు. అది ఈ సారి ఇంకాస్త దూరం వెళ్లిపోయింది. అప్పుడెప్పుడో శింబు నటించిన 'అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్' (ఏఏఏ) సినిమా తాలూకు వివాదం ఇప్పటికీ అతన్ని వదలడం లేదు. ఎప్పుడో 2017 సినిమా ఇంకా తిప్పలు పెడుతుంది. మూడేళ్లుగా శింబు ఈ సినిమా తాలూకు వివాదంలోనే ఉన్నాడు.. అక్కడ్నుంచి బయటికి రాలేకపోతున్నాడు. మధ్యలో చాలా సినిమాలు చేసాడు కానీ ఏఏఏ సినిమా తలనొప్పులు మాత్రం వీడటం లేదు. తాజాగా ఈ వివాదం కారణంగా తమిళ నిర్మాతల మండలి శింబును వెలివేసే పరిస్థితి వచ్చింది. అసలు శింబుకు ఇంత కష్టం ఎందుకొచ్చింది అనుకుంటున్నారా..? 

ఈయన హీరోగా మైఖేల్‌ రాయప్పన్ అనే నిర్మాత నాలుగేళ్ల కింద 'అన్బానవన్‌ – అరసాదవన్‌ – అడంగాదవన్‌' అనే చిత్రాన్ని మొదలుపెట్టాడు. దీన్నే ట్రిపుల్ ఏ అంటారు కూడా. అయితే ఈ సినిమాకు మధ్యలోనే ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో అత్యంత కష్టం మీద సినిమాను విడుదల చేసాడు. కానీ ఏం లాభం లేదు..పుండు మీద కారం జల్లినట్లు సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ఫ్లాప్ తర్వాత నిర్మాత రివర్స్ అయ్యాడు. ప్రమోషన్ సమయంలోనే కాదు సెట్స్ పై ఉన్నపుడు కూడా శింబు ఈ సినిమాకు ఏ మాత్రం సహకరించలేదని.. తనను చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేశాడని నిర్మాత ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర ఆరోపణలు చేశాడు. అప్పట్లో ఈయన చేసిన కామెంట్స్ సంచలనం అయ్యాయి. అప్పుడు ఆ చిత్ర దర్శకుడు కూడా నిర్మాతకే సపోర్ట్ చేసాడు. 

ఈ విషయమై తమిళ నిర్మాతల మండలి జోక్యం చేసుకుని రాయప్పన్, శింబు మధ్య రాజీ కుదిర్చింది. కానీ ఇప్పటికీ అది సరిగ్గా కుదర్లేదని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. రాయప్పన్‌కు ఒక సినిమాను ఉచితంగా చేయడం లేదంటే.. ఆయనకు సినిమా కోసం తీసుకున్న 6.6 కోట్ల మొత్తాన్ని మూడు విడతలుగా చెల్లించేలా ఇద్దరికి ఒప్పందం కుదిరింది. కానీ శింబు రాయప్పన్‌కు సినిమా చేయలేదు. అలాగని తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వలేదు. ఈ విషయమై మైఖేల్‌ రాయప్పన్‌ తిరిగి నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ కోరాడు. దీనిపై సీరియస్‌ అయిన నిర్మాతల మండలి జనవరి 19న అత్యవసరంగా సమావేశమైంది. శింబు భవిష్యత్తులో నటించే చిత్రాలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించరాదని తీర్మానించింది..ఈ తీర్మానంపై శింబు ఎలా స్పందిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇదే కానీ జరిగితే శింబు హీరోగా నటించే సినిమాలకు తిప్పలు తప్పవేమో..?

ఇవి కూడా చ‌ద‌వండి..

టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ విల‌న్ ఇత‌డే..!

చిరంజీవి న‌న్ను చాలా మెచ్చుకున్నారు..

బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్న‌ కేథ‌రిన్

గోవాలో స‌న్నీలియోన్ హాట్ ఫొటోషూట్

అటు కేర‌ళ అందాలు..ఇటు సోనాక్షి వ‌య్యారాలు

ఫొటోగ్రాఫ‌ర్ గా మారిన మీరా రాజ్‌పుత్‌..స్టిల్స్ వైర‌ల్‌


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo