పరిస్థితులు చూస్తుంటే ప్రస్తుతం అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే కమల్ హాసన్ సినిమాను పూర్తిగా శంకర్ పక్కన పెట్టేసినట్లు అర్థం అవుతుంది. ఇప్పుడు కాకపోయినా మరో సమయంలో అయినా కమల్ సినిమా శంకర్ మొదలుపెడతాడేమో అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో.. వాళ్ల ఆశలు అడియాశలు చేస్తూ రామ్ చరణ్ సినిమాతో బిజీ కాబోతున్నాడు శంకర్. లైకా ప్రొడక్షన్స్ శంకర్‌పై కేసు వేసిన కూడా మద్రాస్ హైకోర్టు ఆయనకే సపోర్ట్ చేసింది. ఎలాంటి టెన్షన్ లేకుండా రామ్ చరణ్ సినిమా మొదలు పెట్టుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో హైదరాబాద్‌లోనే ఉంటూ తన సినిమాకు కావాల్సిన పనులు చక్కబెట్టుకుంటున్నారు శంకర్. మొన్నా మధ్య హీరో రామ్ చరణ్‌ను కలిశాడు.. ఆ తర్వాత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌తో ఫోటో షేర్ చేశాడు శంకర్. నిన్నటికి నిన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌తో ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు.
ఇక్కడే ఉంటూ రామ్ చరణ్ సినిమా పనులు చూసుకుంటున్నాడు శంకర్. ఈ సినిమాను వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని ముందు నుంచి తన ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాడు ఈ దర్శకుడు. తాజాగా నిర్మాత దిల్ రాజు కూడా శంకర్ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. తమకు ఇతర సినిమాలతో సంబంధం లేదని.. సెప్టెంబర్ నెల నుంచి శంకర్, రామ్ చరణ్ సినిమా సెట్స్‌పైకి వెళుతుంది అని క్లారిటీ ఇచ్చాడు. ఆ మధ్య అమెరికా వెళ్లిన దిల్ రాజు.. ఇండియాకు వచ్చిన తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు.
తాజాగా ఆయన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని సతీ సమేతంగా దర్శించుకున్నారు. అక్కడ మీడియాతో ముచ్చటిస్తూ తన సినిమాల గురించి చెప్పాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్3; విశ్వక్సేన్ పాగల్; తన తమ్ముడి కొడుకు హీరోగా పరిచయం అవుతున్న రౌడీ బాయ్స్; నాగచైతన్య, విక్రమ్ కె కుమార్ థాంక్యూ; శంకర్, రామ్ చరణ్ సినిమా; అవసరాల శ్రీనివాస్ నూటొక్క జిల్లాల అందగాడుతో పాటు మరో నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు దిల్ రాజు. రాబోయే రెండేళ్లలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి దాదాపు పది సినిమాలు విడుదల కానున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పవర్ స్టార్‌తో ఆ హీరోయిన్ నాలుగో పెళ్లి.. ఫోటో వైరల్?
రాజమౌళి ‘బజరంగీ భాయ్‌జాన్’ ఛాన్స్ ఎలా మిస్సయ్యాడంటే..?
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?