ఆదివారం 17 జనవరి 2021
Cinema - Nov 24, 2020 , 18:12:07

కోలీవుడ్ లో చైల్డ్ అర్డిస్ట్‌..టాలీవుడ్ లో హీరోయిన్

కోలీవుడ్ లో చైల్డ్ అర్డిస్ట్‌..టాలీవుడ్ లో హీరోయిన్

టాలీవుడ్ హీరోలు న‌వీన్ చంద్ర‌, విశ్వ‌క్ సేన్ హీరోలుగా ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్టుతో త‌మిళ భామ అనిఖ సురేంద్ర‌న్ ను టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఎన్నై అరింధాల్‌, విశ్వాసం చిత్రాల్లో బాల‌న‌టిగా ఉత్తమ ప్ర‌తిభ క‌న‌బ‌రిచింది అనిఖ సురేంద్ర‌న్‌. చైల్డ్ ఆర్టిస్టుగా కేర‌ళ రాష్ట్రం నుంచి చాలా అవార్డులు అందుకుందీ బ్యూటీ.ఇపుడు తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు రెడీ అవుతోంది. మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ చిత్రం క‌ప్పెల‌. ఈ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

తెలుగు రీమేక్ లో అనిఖ‌ను వ‌న్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ కోసం ఎంపిక చేసిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. సుకుమార్ ద‌గ్గ‌ర ప‌నిచేసిన వ్య‌క్తి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌నున్న‌ట్టు ఇన్ సైడ్ టాక్. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు. దివంగ‌త త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత బ‌యోగ్రాఫిక‌ల్ డ్రామాగా వ‌చ్చిన క్వీన్ వెబ్ సిరీస్ లో న‌టించింది అనిఖ‌ సురేంద్ర‌న్.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.