శనివారం 23 జనవరి 2021
Cinema - Nov 24, 2020 , 09:07:37

క్యాన్స‌ర్‌తో పోరాడుతూ క‌న్నుమూసిన క‌మెడీయ‌న్

క్యాన్స‌ర్‌తో పోరాడుతూ క‌న్నుమూసిన క‌మెడీయ‌న్

ప్ర‌ముఖ త‌మిళ హాస్య న‌టుడు తావ‌సి క్యాన్స‌ర్‌తో పోరాడుతూ క‌న్నుమూసారు. మ‌ధురైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో సోమ‌వారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఇటీవ‌ల తావ‌సి కుమారుడు త‌న తండ్రి ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఆర్దిక సాయం చేయాలని కోరాడు.  ఈ క్ర‌మంలో కోలీవుడ్ నటులు విజయ్ సేతుపతి, సూరి, శివకార్తికేయన్, సౌందరరాజా, శింబు ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే, సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా తావసి వైద్యానికి ఆర్థిక సాయం అందించారు.

స్టార్స్ సాయంతో మెరుగైన వైద్యం అందించిన‌ప్ప‌టికీ తావ‌సి క‌న్నుమూయ‌డం అంద‌రిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. 140కి పైగా సినిమాల‌లో న‌టించిన తావ‌సి క్యాన్స‌ర్‌ని జ‌యించాల‌ని ఎంద‌రో అభిమానులు ప్రార్ధించారు. కాని ఆ ప్రార్ద‌న‌లు దేవుడు వినలేదు. ఆయ‌న‌ని అనంత‌లోకాల‌కు తీసుకెళ్ళారు.  ‘వరుతపడత వలిబార్ సంగం’, ‘సీమరాజా’, ‘రజినీమురుగన్’ తదితర చిత్రాల్లో తావసి నటించారు. ‘వరుతపడత వలిబార్ సంగం’ సినిమా తావ‌సికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆయ‌న మృతికి కోలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు. 


logo