గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 14, 2020 , 18:38:52

హైలెట్ గా త‌మ‌న్నా, వెన్నెల కిశోర్ పార్ట్‌..!

హైలెట్ గా త‌మ‌న్నా, వెన్నెల కిశోర్ పార్ట్‌..!

యాక్ష‌న్ హీరో గోపీచంద్ హీరోగా న‌టిస్తోన్న తాజా ప్రాజెక్టు సీటీమార్. సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. లాక్ డౌన్ ప్ర‌భావంతో నిలిచిపోయిన షూటింగ్ ను గోపీచంద్ అండ్ టీం ఇటీవ‌లే ప‌రిమిత సంఖ్య‌లో సిబ్బందితో రీస్టార్ట్ చేసింది.స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చే ఈ సినిమాలో త‌మ‌న్నా, వెన్నెల కిశోర్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు హైలెట్ గా నిలిచేలా ప్లాన్ చేశాడ‌ని, దీనికోసం సంప‌త్ నంది స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు కూడా చేశాడ‌ని టాక్ వినిపిస్తోంది. క‌థానుగుణంగా వెన్నెల కిశోర్ త‌మ‌న్నాకు అసిస్టెంట్ గా న‌టిస్తాడ‌ని ఇన్ సైడ్ టాక్‌. 

ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రాకు లీడ్ చేసే ఫీమేల్ క‌బ‌డ్డీ టీంకు కోచ్ గా క‌నిపించ‌నుండ‌గా..తెలంగాణ ఫీమేల్ క‌బ‌డ్డీ టీం కోచ్ గా త‌మ‌న్నా న‌టిస్తోంది. గౌత‌మ్ నందా చిత్రంతో ప‌రాజ‌యం చ‌విచూసిన సంప‌త్ నంది-గోపీ చంద్ ఈ చిత్రంతో మంచి హిట్ కొట్టాలని భావిస్తున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo