బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 03, 2020 , 15:10:48

రాజమౌళి నుంచి పిలుపు వచ్చిందంటే ఫిక్సవ్వాలి..!

రాజమౌళి నుంచి పిలుపు వచ్చిందంటే ఫిక్సవ్వాలి..!

వరుస సినిమా షూటింగ్ లతో బిజీబిజీగా ఉండే తమన్నాకు లాక్ డౌన్ తర్వాత ఇంటిపట్టునే ఉండిపోవడం కష్టతరంగా మారిందట. ప్రస్తుత పరిస్థితుల్లో చేసేదేమి లేక నిశ్శబ్దంగా ఉండటమే బెటర్ అనుకుంటుందట. తమన్నా జీవన శైలిలో మార్పు, భగవద్గీత పారాయణం, దుర్గామాత గ్రంథాలను చదువుతూ కొత్త విషయాలను తెలుసుకునే పనిలో ఉన్నట్లు ఫిలింనగర్ వర్గాల టాక్. 

అయితే డైరెక్టర్ రాజమౌళి యాక్టర్ ను ఎలా ఎంపికచేస్తారనే విషయమై క్లారిటీ ఇచ్చింది తమన్నా. రాజమౌళి సార్ తనతోపాటు అసోసియేట్ అయ్యే వారికి సినిమాలో అవకాశం ఇవ్వరు. ఆయన తీస్తున్న ప్రాజెక్టులో కావాల్సిన పాత్రకు ఏ నటులైతే సరిపోతారని ఫిక్స్ అవుతారో వారికే అవకాశం ఇస్తారు. 

మీకు రాజమౌళి నుంచి ఫోన్ కాల్ వచ్చిందంటే చాలు..సినిమాలోని పాత్ర మీ కోసమే సిద్దం చేయబడినట్లు గ్రహించాలి అని చెప్పుకొచ్చింది. అంతేకాదు భాష అనేది ముఖ్యం కాదని, బాహుబలి సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆదరించారు. సినిమాకు పనిచేసిన వారంతా భారతీయ సినిమాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారనే విషయాన్ని గ్రహించానని తెలిపింది.


logo