బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Oct 06, 2020 , 10:14:01

క‌రోనా నుండి కోలుకున్న త‌మ‌న్నా!

క‌రోనా నుండి కోలుకున్న త‌మ‌న్నా!

ఏడు నెల‌ల త‌ర్వాత హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొన్న త‌మ‌న్నాకు క‌రోనా సోకింది. ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ షూటింగ్ చేసిన‌ప్ప‌టికీ తాను క‌రోనా బారిన ప‌డిన‌ట్టు త‌మ‌న్నా పేర్కొన్నారు. జ్వ‌రం వ‌స్తుండ‌డంతో టెస్ట్ చేయించుకున్న ఆమెకు క‌రోనా పాజిటివ్ ని తేలింద‌ట‌. అయితే ప్ర‌స్తుతం  తాను కరోనా నుండి కోలుకున్న విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఓ లేఖని విడుద‌ల చేసింది. 

త‌మన్నా.. త‌న ఆరోగ్యంకి సంబంధించిన విష‌యాలు తెలియ‌జేస్తూ.. నేను నా టీం సెట్‌లో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. కాని ఎలా సోకిందో అర్ధం కావ‌డం లేదు. గ‌త వారం లైట్ ఫీవ‌ర్ ఉండ‌డంతో క‌రోనా టెస్ట్ చేయించుకోగా, పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. ఈ స‌మస్య నుండి బ‌య‌ట ప‌డేందుకు హైద‌రాబాద్‌లోని ప్రైవేట్ ఆసుప‌త్రిలో వెంట‌నే అడ్మిట్ అయి చికిత్స తీసుకున్నాను. నిపుణులైన వైద్యుల సంరక్షణలో ట్రీట్‌మెంట్‌ అనంతరం.. డాక్టర్ల సలహాతో నేనిప్పుడు డిశ్చార్జ్ అయ్యాను. 

ప్ర‌పంచాన్ని వణికిస్తున్న క‌రోనా మ‌హమ్మారి నుండి త్వ‌ర‌గా కోలుకోవ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. పూర్తి ఆరోగ్యంతో త్వ‌ర‌లోనే మీ ముందుకు వ‌స్తాను.  ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నాను. నాకోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండండి అని త‌మ‌న్నా పేర్కొన్నారు.



logo