గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Oct 15, 2020 , 10:08:07

క‌రోనా నుండి కోలుకొని ఇంటికి చేరుకున్న త‌మ‌న్నా

క‌రోనా నుండి కోలుకొని ఇంటికి  చేరుకున్న త‌మ‌న్నా

క‌రోనా మ‌హ‌మ్మారి సామాన్యుల‌నే కాదు సెల‌బ్రిటీలను వణికిస్తుంది. ఇప్ప‌టికే క‌రోనాతో కొంద‌రు ప్ర‌ముఖులు మృత్యువాత ప‌డ‌గా, మ‌రి కొంద‌రు కొలుకున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా క‌రోనా బారిన ప‌డింది. హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న ఓ వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొన్న స‌మ‌యంలో త‌మ‌న్నాకు క‌రోనా సోకింది. ప్రైవేట్ ఆసుప‌త్రిలో మెరుగైన వైద్యం తీసుకున్న ఈ అమ్మ‌డు ఇప్పుడు పూర్తిగా కోలుకుంది.  

కరోనా నుండి బ‌య‌ట‌ప‌డ్డ త‌మ‌న్నా తాజాగా ముంబైలోని త‌న ఇంటికి చేరుకుంది. ఇందుకు సంబంధించి త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో కారులో నుండి దిగ‌గానే త‌న త‌ల్లిదండ్రుల‌ని హ‌గ్ చేసుకోవ‌డం, త‌న పెంపుడు కుక్క‌తో ఆడుకోవ‌డం క‌నిపించాయి.  ఇంత తర్వగా కోలుకుంటానని అనుకోలేదు. ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు, కుటుంబసభ్యుల ప్రార్థనలతోనే త్వరగా బమటపడ్డారు. ఇప్పుడు నేనే ఇమ్యునిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది అని పేర్కొంది త‌మ‌న్నా. కాగా, కొద్దిరోజుల క్రితం త‌మ‌న్నా త‌ల్లిదండ్రులు కూడా కరోనా బారిన ప‌డి కోలుకున్న విష‌యం తెలిసిందే.logo