మిల్కీ బ్యూటీ తమన్నా ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. సినిమా, టీవీ, డిజిటల్ రంగం ఇలా ఏదైన సరే ఓకే అంటుంది. “లెవెన్త్ అవర్” అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా రీసెంట్గా మరో వెబ్ సిరీస్ “నవంబర్ స్టోరీ”తో ప్రేక్షకులను పలకరించింది. ఇందులో తమన్నా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక సినిమాల విషయానికి వస్తే తమన్నా నటించిన సీటీమార్, ఎఫ్ 3 చిత్రాలు ఈ ఏడాది విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
నితిన్ నటిస్తున్న మ్యాస్ట్రో చిత్రంలో తమన్నా నెగెటివ్ రోల్ పోషిస్తుంది. బాలీవుడ్ నటి టబు పాత్రలో తమన్నా కనిపించి అలరించేందుకు సిద్ధమవుతుంది. అయితే ఇప్పుడు ప్రముఖ టీవీ ఛానెల్ కోసం హోస్ట్‌గా మారనుందట. ‘మాస్టర్ చెఫ్’ తరహాలో ఓ షోని ప్లాన్ చేయగా, ఈ షోకి తమన్నా హోస్ట్‌గా ఉంటుందని, ఇప్పటికే సైన్ చేయడం కూడా అయిపోందని వినికిడి. కన్నడలో ఇలాంటి కార్యక్రమాన్ని సుదీప్ చేస్తున్న విషయం తెలిసిందే.