పదిహేనేళ్ల వయస్సులో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది ముంబై భామ తమన్నా (Tamannaah). ఇపుడు తమన్నా వయస్సు 31. బాహుబలి ప్రాంఛైజీ, కేజీఎఫ్ చాఫ్టర్ 1, సైరా లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో నటించి సౌతిండియాలో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ పొజిషన్ లో ఉంది తమన్నా. స్టార్ డమ్ విషయంపై ఈ భామ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ..పలు విషయాలు షేర్ చేసుకుంది.
నేను పదిహేనేళ్ల వయస్సులో సినిమాల్లో పనిచేయడం మొదలుపెట్టినపుడు..స్టార్ డమ్ ను చూసి ఇక్కడికి రాలేదు. నేను కెమెరా ముందు నిలబడాలనుకున్నా. నేను ఎంచుకున్న మార్గంలో ఏం అందుకున్నా సరే. అదృష్టవశాత్తు నాకలాంటి స్టార్ డమ్ రావడమే కాకుండా కొనసాగుతుంది. కానీ స్టార్డమ్ కోసం సినిమాల్లోని రాలేదు. ప్రతీ రోజు సెట్స్ కు వెళ్లినపుడు ఆ ఎక్జయిట్మెంట్ గొప్ప అనుభూతినిస్తుంది. అయితే కష్టపడి సంపాదించిన స్టార్ డమ్ ను ఎవరూ కోల్పోరు. స్టార్ డమ్ విషయంలో ఎవరో భయపడినట్టు తాను భయపడనని చెప్పుకొచ్చింది తమన్నా.
తమన్నా కు ఇన్ స్టాగ్రామ్ (Tamannaah Instagram) లో 14.3 మిలియన్ల ఫాలోవర్లుండగా..ట్విటర్ లో 5.1 మిలియన్ల మంది ఉన్నారు. ప్రస్తుతం గోపీచంద్ తో కలిసి సీటీమార్ సినిమాలో నటిస్తోంది తమన్నా. ఈ మూవీ విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇవికూడా చదవండి..
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!