బుధవారం 02 డిసెంబర్ 2020
Cinema - Jul 12, 2020 , 23:39:19

తమన్నా మెత్త చాలెంజ్‌

తమన్నా మెత్త చాలెంజ్‌

లాక్‌డౌన్‌ టైమ్‌లో తమన్నా విసిరిన పిల్లో (మెత్త)0ఛాలెంజ్‌ సరికొత్త ఐడియాగా అందరిని ఆకట్టుకుంది. సాధారణంగా అందాల ఆరబోతకు రకరకాల ఫ్యాషన్‌ వస్ర్తాల్ని ధరించడం పరిపాటి. కానీ అందుకు భిన్నంగా కేవలం ఒంటిపై తలదిండును ఆచ్ఛాదనగా చేసుకొని అర్ధనగ్నంగా ఫోటోలకు ఫోజులివ్వడం ఈ పిల్లో ఛాలెంజ్‌ ప్రత్యేకత. ఇందులో పాయల్‌రాజ్‌పుత్‌ కూడా పాల్గొని హాట్‌హాట్‌ అందాలతో మెప్పించింది. దీంతో పాటు ఈ భామ పేపర్‌డ్రెస్‌ అంటూ న్యూస్‌పేపర్‌ను వస్త్రంలా కప్పుకొని యువతను హుషారెత్తించింది. లాక్‌డౌన్‌ విరామంతో ఈ ఇద్దరి పంజాబీ భామల గ్లామరస్‌ ఛాలెంజ్‌లు విశేషంగా ఆకట్టుకున్నాయి.  ఫిట్‌నెస్‌కు అధికంగా ప్రాధాన్యమిచ్చే తమన్నా మూడు నెలల గ్యాప్‌ను చక్కగా వినియోగించుకున్నది.  యోగా, వర్కవుట్స్‌ చేస్తున్న వీడియోల్ని, ఫొటోల్ని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. పాయల్‌రాజ్‌పుత్‌ ఈ విరామంలో ఫొటోషూట్‌లకే పరిమితం కాకుండా  గృహహింస నేపథ్యంలో ‘ది రైటర్‌' లఘు చిత్రంలో నటించింది. చిత్రకారిణిగా మారి పలు అందమైన బొమ్మలు వేస్తూ విరామాన్ని గడిపింది.  లావణ్యత్రిపాఠి సైతం సంప్రదాయ వస్త్రధారణలో మోడ్రన్‌  దుస్తుల్లో సరికొత్త ఫొటోషూట్‌లతో ఈ విరామంలో మెప్పించింది.  సినిమాలకు దూరంగా ఉంటున్న శ్రద్ధాదాస్‌, ప్రగ్యాజైస్వాల్‌ సెక్సీ ఫొటోషూట్‌లతో లాక్‌డౌన్‌లో అభిమానులను కనువిందు చేశారు. మూడు నెలలుగా హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న శృతిహాసన్‌ స్వీయ ఫొటోషూట్‌ చేసి మెప్పించింది. సంగీతంలో మరింత ప్రావీణ్యాన్ని సంపాదించుకునే ప్రయత్నాలు చేసింది.