మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Sep 16, 2020 , 00:09:52

కార్పొరేట్‌ థ్రిల్లర్‌ సిరీస్‌లో..

కార్పొరేట్‌  థ్రిల్లర్‌ సిరీస్‌లో..

సినిమాలతో వెండితెరపై ప్రతిభను చాటుతూనే విభిన్నమైన కథాంశాలతో కూడిన వెబ్‌సిరీస్‌లో భాగమయ్యేందుకు ఆసక్తిని చూపుతున్నారు  అగ్రనాయికలు. ఇప్పటికే సమంత, కాజల్‌ అగర్వాల్‌తో పాటు పలువురు స్టార్‌ హీరోయిన్‌లు వెబ్‌సిరీస్‌లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా వారిబాటలోనే తమన్నా అడుగులు వేయబోతున్నది. తెలుగులో ఓ వెబ్‌సిరీస్‌లో ఆమె నటించనున్నట్లు సమాచారం. కార్పొరేట్‌ థ్రిల్లర్‌ డ్రామాగా రూపొందనున్న ఈ వెబ్‌సిరీస్‌కు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం.

కథతో పాటు నాయిక పాత్రను తీర్చిదిద్దిన తీరు నచ్చడంతో తమన్నా ఈ వెబ్‌సిరీస్‌లో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. కార్పొరేట్‌ ప్రపంచంలోని పోటీతత్వాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కనున్న ఈ సిరీస్‌లో విలక్షణ  మనస్తత్వం కలిగిన యువతిగా తమన్నా కనిపిస్తుందని చెబుతున్నారు.  ఎనిమిది ఎపిసోడ్స్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సిరీస్‌లో అరుణ్‌ అదిత్‌ కీలక పాత్రలో నటించనున్నారు. త్వరలో ఈ వెబ్‌సిరీస్‌ షూటింగ్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


logo