మంగళవారం 09 మార్చి 2021
Cinema - Nov 19, 2020 , 00:17:04

బంధుప్రీతి కాదు

బంధుప్రీతి కాదు

ప్రతిభ ముఖ్యండిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ కారణంగా నటీనటులకు తమ ప్రతిభనును నిరూపించుకునే అవకాశాలు మెరుగయ్యాయని అంటోంది తమన్నా.తారల నేపథ్యం? పూర్వానుభవంతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో రాణించేందుకు మార్గం సులభమైందని చెబుతోంది. ‘లెవంత్‌ అవర్‌' వెబ్‌సిరీస్‌తో త్వరలో తమన్నా  ఓటీటీలో అరంగేట్రం చేస్తోంది. డిజిటల్‌లోకి అడుగుపెట్టడానికి గల కారణాల్ని తమన్నా వివరిస్తూ ‘డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ వల్ల చిత్రసీమలో చాలా మార్పులొచ్చాయి. బంధుప్రీతి, క్యాంపిజం లాంటి ధోరణులు తొలగిపోయి ప్రతిభాపాటవాలకు  విలువనిస్తున్నారు.  గతంలో కొత్తగా ఇండస్ట్రీలో అడుగుపెట్టేవారు నిలదొక్కుకోవడానికి  చాలా సమయం పట్టేది. కానీ డిజిటల్‌ రాకతో నూతన ప్రతిభ ఎక్కువగా వెలుగులోకి వస్తోంది.  భవిష్యత్తులో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ విస్తృతి మరింత పెరుగుతుందని అనుకుంటున్నా. కొత్త విధానానికి తగినట్లుగా తమ కెరీర్‌ను తారలు తీర్చిదిద్దుకోగలిగినప్పుడే రాణిస్తారు’ అని తెలిపింది. 

VIDEOS

logo