మంగళవారం 26 మే 2020
Cinema - May 17, 2020 , 23:17:01

సింధీ భాష నేర్చుకుంటున్నా

సింధీ భాష నేర్చుకుంటున్నా

‘పురాణాలు, వ్యక్తిత్వవికాసానికి సంబంధించి వెనకటితరాల నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఎన్నో  ఉన్నాయని లాక్‌డౌన్‌ విరామంలో అవగతమైంది. తల్లిదండ్రుల నుంచి నేర్చుకోగలిగినప్పుడే భవిష్యత్‌ తరాలకు వాటిని విలువను చెప్పగలం’ అని  అంటోంది తమన్నా. కరోనా ప్రభావంతో ముంబయిలో చిక్కుకుపోయిందీ మిల్కీబ్యూటీ.  విరామ సమయాన్ని ఎలా సద్వినియోగం  చేసుకుంటున్నది వివరిస్తూ  ‘గతంలో  షూటింగ్‌ల కోసం ముంబయి, చెన్నై, హైదరాబాద్‌ మధ్య నిరంతరం ప్రయాణిస్తూ ఉండేదాన్ని. నెలల తరబడి ఒకే చోట ఉండి చాలాకాలమైంది. లాక్‌డౌన్‌ కారణంగా ముంబయిలోనే రెండు నెలలుగా ఉండటం కొత్త అనుభూతిని పంచుతోంది. కాలం ఆగిపోయినట్లుగా ఉన్నది.  నా మాతృభాష సింధీ. కానీ తెలుగు, తమిళంలో మాట్లాడినంత స్పష్టంగా సింధీలో మాట్లాడలేను.  ప్రస్తుతం ఇంట్లో అమ్మతో ఎక్కువగా సింధీలోనే మాట్లాడుతూ భాషపై పట్టు సాధిస్తున్నాను.  సంప్రదాయ వంటలను  చేయడం నేర్చుకుంటున్నా.  అమ్మకు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువే.  పురాణాలు, ఇతిహాసాల గొప్పతనాన్ని అమ్మ నాకు వివరిస్తుంది. నేను నేర్చుకున్నప్పుడే నా తర్వాతి తరాలకు వాటి విలువను భోదించగలనని అర్థమైంది.  కరోనా ప్రభావంతో తమ్ముడు ఆనంద్‌ న్యూయార్క్‌లోనే ఉండిపోయాడు. అతడిని మిస్సవుతున్నా’ అంటూ తెలిపింది. logo