గురువారం 04 జూన్ 2020
Cinema - Apr 24, 2020 , 23:59:53

ప్రకృతి పరీక్ష ఇది

ప్రకృతి పరీక్ష ఇది

లాక్‌డౌన్‌ వల్ల మనుషులందరి పరిస్థితి బోనులో బంధింపబడిన జంతువుల మాదిరిగా మారిపోయిందని, ఈ విశ్వం మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోవడానికి కల్పించిన ఓ గొప్ప అవకాశమది’ అని చెప్పింది మిల్కీబ్యూటీ తమన్నా. ‘ఈ అనూహ్య ఉత్పాతం ఎందరో ప్రాణాల్ని బలి    తీసుకుంది. ఆర్థిక వ్యవస్థల్ని పతనం చేసింది. మనిషి తనపై జరిపిన విధ్వంసానికి ప్రకృతి తీర్చుకుంటున్న ప్రతీకారమే ఈ విపత్తు అనిపిస్తోంది. ఏదీ ఏమైనా ఇలాంటి సంక్షోభకాలంలో ఒకరికొకరు తోడుగా ఉంటూ ప్రభుత్వ ఆదేశాల్ని పాటిస్తూ కరోనాపై విజయం సాధించాలి. మన క్షేమాన్ని చూసుకుంటూ పక్కవారి క్షేమం కోసం కూడా పాటుపడాలి’ అని చెప్పింది. కరోనా ప్రభావంతో ఉపాధి కరువైన మురికివాడల ప్రజలకు ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి సేవలందిస్తోంది తమన్నా. ఇప్పటికే పదివేల మందికి సరిపడా ఆహారపదార్థాల్ని ఆ సంస్థ భాగస్వామ్యంతో పంపిణీ చేశానని తమన్నా చెప్పింది. ‘లాక్‌డౌన్‌ వల్ల ఏ ఒక్కరూ పస్తులుండే పరిస్థితులు రావొద్దని కోరుకున్నా. అందుకే లెట్స్‌ఆల్‌హెల్ప్‌ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ముంబయిలో చిక్కుకుపోయిన వలస కార్మికులతో పాటు మురికివాడ ప్రజలకు చేతనైన సహాయం అందిస్తున్నా’ అని తమన్నా చెప్పింది.


logo