బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Oct 07, 2020 , 01:33:54

ఆసుపత్రి నుంచి తమన్నా డిశ్చార్జ్‌

ఆసుపత్రి నుంచి తమన్నా డిశ్చార్జ్‌

కరోనా మహమ్మారి బారిన పడిన కథానాయిక తమన్నా సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. వైద్యుల సూచన మేరకు  స్వీయ నిర్భందంలో ఉండబోతున్నానని ఆమె తెలిపింది ఇటీవల తమన్నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దాంతో ఆమె క్షేమసమాచారాలపై ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో తన ఆరోగ్య పరిస్థితిపై తమన్నా ఓ ప్రకటనను విడుదలచేసింది. ‘సెట్స్‌లో నాతో పాటు నా టీమ్‌ ఎల్లప్పుడూ క్రమశిక్షణతో పనిచేస్తుంటాం.  కానీ దురదృష్టవశాత్తూ  గత వారం నాకు స్వల్ప జ్వరం వచ్చింది. కోవిడ్‌ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది.  హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి నిపుణులైన వైద్యుల సంరక్షణలో చికిత్స తీసుకున్నా.  ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాను. వైద్యుల సలహా మేరకు స్వీయ నిర్భందాన్ని పాటిస్తున్నా. వారం చాలా కఠినంగా గడిచింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఇబ్బందులు పెడుతున్న ఈ కరోనా మహమ్మారి నుంచి నేను పూర్తిగా కోలుకుంటాననే నమ్మకముంది’  అని చెప్పింది.


logo