శుక్రవారం 10 జూలై 2020
Cinema - Jun 03, 2020 , 23:10:49

కేసీఆర్‌ది గొప్ప మనసు

కేసీఆర్‌ది గొప్ప మనసు

‘సినిమాలు సమాజానికి సందేశంతో పాటు వినోదాన్ని అందిస్తున్నాయి. ఎన్నో మంచి విషయాల్ని నేర్పుతున్నాయి. అలాంటి సినిమాను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొప్ప మనసుతో  ప్రయత్నిస్తున్నారు’ అని అన్నారు టీఆర్‌ఎస్‌ నాయకుడు తలసాని సాయికిరణ్‌. తలసాని ట్రస్ట్‌ ద్వారా పద్నాలుగు వేల మంది సినీ కార్మికులకు ఆయన నిత్యవసరాల్ని అందించారు. తలసాని సాయికిరణ్‌ మాట్లాడుతూ ‘తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేయడమే కాకుండా సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్ల మాదిరిగా భావిస్తూ రాష్టాన్ని ముందుకు నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.  కరోనా మహమ్మారి నుంచి తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవాలనే ఆలోచనతో ఉన్నారు’ అని అన్నారు.  త్వరలోనే షూటింగ్‌ల అనుమతులకు సంబంధించిన జీవో రానున్నదని సి.కల్యాణ్‌ చెప్పారు.. 


logo